HomeTelugu Big Storiesవకీల్‌ సాబ్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌..

వకీల్‌ సాబ్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌..

Vakeel Saab motion poster r
నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. పవన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది . సరిగ్గా ఈ రోజు ఉదయం 9.09 గంటలకు దీన్ని రిలీజ్‌ చేశారు. గాంధీజీ ఫొటోతో ప్రారంభమవుతున్న ఈ మోషన్ పోస్టర్‌లో వకీల్ పాత్రలో పవన్ కల్యాణ్ నల్లకోటు, చేతిలో న్యాయ శాస్త్ర పుస్తకం, మరో చేతిలో బేస్ బాల్ స్టిక్ పట్టుకుని కనపడుతున్నారు.

దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యలు నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu