HomeTelugu Trendingసల్మాన్‌ ఖాన్‌ మేనల్లుడు మృతి

సల్మాన్‌ ఖాన్‌ మేనల్లుడు మృతి

8 30
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ (38) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. ఈ విషాయాన్ని సల్మాన్‌ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము’ అంటూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

అబ్దుల్లా మృతి పట్ల సల్మాన్‌ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, బాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కాగా వ్యక్తిగతంగా బాడీబిల్డర్‌ అయిన అబ్దుల్లా సల్మాన్‌తో కలిసి అనేక వేదికలపై కనిపించారు. వీరిద్దరూ కలిసి జిమ్‌ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్‌ గతంలో అనేకసార్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu