HomeTelugu Trending'సామజవరగమన' ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

‘సామజవరగమన’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

7 15
త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందే ఈ చిత్రంలోని అన్ని పాటలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ‘సామజవరగమన’ పాట మాత్రం విడుదల చేసిన నాటి నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘సామజవరగమన’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లో మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షల్లో లైకులతో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకువెళ్లింది.

‘సామజవరగమన’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోన్న నేపథ్యంలో తాజాగా ఆ పాటకు సంబంధించిన సాంగ్‌ ఫుల్‌ వీడియోను ఆదివారం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu