HomeTelugu Trendingబిగ్‌బాస్‌: హోస్ట్‌గా అక్కినేని వారి కోడలు!

బిగ్‌బాస్‌: హోస్ట్‌గా అక్కినేని వారి కోడలు!

Samantha akkineni as a Bigబుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. తెలుగులో నాల్గో సీజ‌న్‌ జరుగుంది. ఈ షోకి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ‌నాలీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. దీంతో మ‌రోసారి సోషల్‌ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈసారి నాగర్జున స్థానంలో ఆయన కోడ‌లు, స్టార్‌ హీరోయిన్ స‌మంత హోస్ట్‌గా రానుంద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. మామ మాట‌ కాద‌న‌లేక ఈ ఒక్క‌సారికి ఒప్పేసుకుంటున్న‌ట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా దీనివ‌ల్ల షోకి అద‌న‌పు హంగు కూడా వ‌స్తుంద‌ని బిగ్‌బాస్ నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌‌. కానీ ఇది నిజం కాక‌పోవచ్చు. ఎందుకంటే అటు సినిమాను, ఇటు బిగ్‌బాస్‌ను బ్యాలెన్స్ చేయ‌డానికి నాగ్ ఇప్ప‌టికే రెడీ అయ్యారు. గ‌తంలో చెప్పిన‌ట్లుగానే ప్ర‌త్యేక చార్టెడ్ విమానంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చి వీకెండ్స్‌ షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. అయితే ద‌స‌రా స్పెషల్‌గా నిజంగానే స‌మంత‌ను ఈషోకి తీసుకువ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. కాగా ఈ వారం అరియానా, అవినాష్ కెప్టెన్సీకి పోటీ పడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu