HomeTelugu Trendingసమంతకు తగ్గని క్రేజ్.. నెంబవన్ స్థానం కైవసం

సమంతకు తగ్గని క్రేజ్.. నెంబవన్ స్థానం కైవసం

11 14
టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది సమంత. ఇండస్ట్రీలో హీరోయిన్లు సాధారణంగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటారు. కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా తన సత్తా చూపిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. నాగ చైతన్యతో వివాహం అనంతరం షూటింగ్‌లకు స్వస్తి చెప్తుందని అనుకున్నారు చాలామంది. కానీ పెళ్లయిన తర్వాతే తాను విభిన్న ఆలోచనలతో కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది.

తనకు పోటీగా కుర్ర హీరోయిన్లు పూజాహెగ్డే, రష్మికలు చక్రం తిప్పుతున్నా సమంత క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఆయా రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు మహిళలపై ఓ ఆంగ్ల పత్రిక సర్వే నిర్వహించింది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ 2019 జాబితాలో సమంత అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌లుగా కొనసాగుతున్న పూజాహెగ్డేకు ఐదో స్థానం, రష్మిక మందన్నకు 9వ స్థానం దక్కింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu