HomeTelugu Big Storiesచిరంజీవి సినిమాలో సమంత.. మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్స్...

చిరంజీవి సినిమాలో సమంత.. మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్స్…

1 11
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న 152 చిత్రంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గెస్ట్ రోల్ కనిపించనున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ చిరంజీవి పాత్రలో చరణ్ నటిస్తాడని.. అది కూడా నక్సలైట్ పాత్ర అని తెలుస్తుంది. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు కానీ చరణ్ నటించడం మాత్రం షూర్‌ అని తెలుస్తుంది. అయితే ఇందులో రామ్‌ చరణ్‌ కు జోడిగా సమంత అక్కినేన నటించబోతుందని తెలుస్తుంది. ముందు ఈ పాత్ర కోసం కియారా అద్వానీతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లను అడిగినా కూడా వాళ్లు ఆసక్తి చూపించకపోవడంతో సమంతను తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే ఐటెం సాంగ్ కోసం మాత్రం రెజీనాని తీసుకోవడం.. ఇప్పటికే ఆమెపై ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం కూడా జరిగాయి. ఇప్పుడు చరణ్, సమంత అంటున్నారు.. ఏదేమైనా కూడా చాలా స్పెషల్స్‌తో చిరంజీవి సినిమా వచ్చేస్తుంది. దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాయి. ఎప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో చరణ్ పాల్గొనబోతున్నాడు. దాదాపు అరగంట పాటు ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని.. కథను మలుపు తిప్పేలా ఉండబోయే ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

2 12

Recent Articles English

Gallery

Recent Articles Telugu