HomeTelugu Big Storiesఅనుపమా ..ఆమెలా నటించేందుకు ప్రయత్నించిందట

అనుపమా ..ఆమెలా నటించేందుకు ప్రయత్నించిందట

12 15నటి అనుపమా పరమేశ్వరన్ తెలుగులో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా హిట్ కావడంతో.. అనుపమకు క్రేజ్ పెరిగింది. ఆ తరువాత ఈ హీరోయిన్ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ అ ఆ సినిమాలో నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో నటించి మెప్పించింది.

అ ఆ తరువాత మంచి పేరు తెచ్చుకునే పాత్రలు రాలేదు. మలయాళంలో మాత్రం బాగా బిజీ అయ్యింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అమ్మడు తమిళంలో హిట్టైన రాక్షసన్ సినిమాకు రీమేక్ చేస్తున్న రాక్షసుడు మూవీలో హీరోయిన్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. ఇందులో అనుపమ టీచర్ రోల్ చేస్తుందట. ఇలాంటి రోల్ ను ఇప్పటి వరకు చేయలేదని, చాలా బాగా వచ్చిందని చెప్పింది. అమలా పాల్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన అనుపమా, ఆమెలా నటించేందుకు ప్రయత్నించానని చెప్పింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu