HomeTelugu Trendingసమంత సినిమాకు భారీ కటౌట్లు

సమంత సినిమాకు భారీ కటౌట్లు

11 2

ప్రముఖ నటి సమంతకి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఫాలోయింగ్‌ ఉందో తెలిసిందే. స్టార్‌ హీరోల‌ను మించిన ఇమేజ్ సమంత సొంతం. సమంత సినిమా వస్తుందటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెల్లువెత్తుతుంటారు. చేసే ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ.. సమంత తన నటనతోనే ఆ సినిమా విజయానికి దగ్గర చేస్తుంటుంది. అందుకే ఆమెకు ప్రేక్షకాదరణ భారీగా ఉంటుంది.

ఓ బేబీతో మ‌రోసారి త‌ను ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం ఖాయం అని చెబుతుంది స‌మంత‌. సమంత తాజాగా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఓ బేబీ’ ఈ నెల 5న విడుదల కాబోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ట్రైలర్ చాలా బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఏకంగా ఆమెకు భారీ కటౌట్లు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దనున్న దేవి థియేటర్ అలాగే ఇతర థియేటర్లలో ఈ కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రేజ్ చూస్తుంటే సినిమాకు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu