HomeTelugu Trendingసమంత ఫిట్‌నెస్‌ వీడియో.. స్ఫూర్తి ఎవరో తెలుసా!

సమంత ఫిట్‌నెస్‌ వీడియో.. స్ఫూర్తి ఎవరో తెలుసా!

2 24స్టార్‌ హీరోయిన్‌ సమంత ఫిట్‌నెస్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదు. ఆమె కొత్త కసరత్తులతో తెగ సాధన చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో తీసిన ఫొటో, వీడియోను సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేశారు. అందులోని ఫొటోలో ఆమె చేతులపై శరీరాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ కనిపించారు. జిమ్‌ ట్రైనర్‌ జాక్సన్‌ ఆమెకు శిక్షణ ఇస్తూ పక్కన నిలబడ్డారు. ఈ ఫొటో చూసిన అభిమానులు సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘అద్భుతం, సూపర్‌ వుమెన్‌, మీలో కష్టపడేతత్వం ఉంది కాబట్టే అందరూ ఇంతగా ఇష్టపడుతున్నారు, స్ఫూర్తిదాయకం..’ అంటూ కామెంట్లు చేశారు.

అంతేకాదు పల్టీ కొడుతున్న వీడియోను షేర్‌ చేస్తూ.. ‘దీన్ని మా మామ నుంచి నేర్చుకున్నా’ అని సామ్‌ పేర్కొన్నారు. ఆమె మామయ్య, అగ్ర హీరో అక్కినేని నాగార్జున కూడా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యం ఇస్తుంటారు. అందుకే ఆయన 59ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా ఫిట్‌గా కనిపిస్తున్నారు.

సమంత ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’ సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క దర్శకురాలు నందినిరెడ్డి తెరకెక్కిస్తున్న సినిమాలోనూ సమంత నటిస్తున్నట్లు సమాచారం. కొరియన్‌ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్‌గా దీన్ని తీస్తున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu