HomeTelugu Trendingదాసరి నారాయణరావు బయోపిక్‌

దాసరి నారాయణరావు బయోపిక్‌

Dasari narayana rao biopic

టాలీవుడ్‌లో ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు బయోపిక్‌ రానున్నట్లు తెలుస్తోంది. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడిగా దాస‌రి త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, జ‌ర్న‌లిస్ట్‌గా, పొలిటీషియ‌న్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాస‌రి అనారోగ్యంతో 2017 మే 30న తుదిశ్వాస విడిచారు.

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ధ‌వ‌ళ స‌త్యం ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయ‌బోతుండ‌గా.. ఇమేజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై టీ ర‌మేశ్ నాయుడు నిర్మించ‌నున్నారు. బ‌యోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌వ‌గా.. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. పాపుల‌ర్ హీరో దాస‌రి నారాయ‌ణ రావు పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్లు తెలుస్తోంది‌. ఆ హీరో ఎవ‌ర‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దాసరి గౌర‌వార్థం ప్ర‌తీ యేటా దాస‌రి నారాయ‌ణ రావు ఫిల్మ్ అండ్ టీవీ నేష‌న‌ల్ అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. దీంతోపాటు టీ రమేశ్ నాయుడు దాస‌రి నారాయ‌ణ రావు మెమోరియ‌ల్ క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu