HomeTelugu Trendingఎన్టీఆర్‌ 30వ సినిమాలో సమంత!

ఎన్టీఆర్‌ 30వ సినిమాలో సమంత!

Samantha in NTR Koratala Si
టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌30వ సినిమా రూపొందనున్న ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌లో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌ను రిపీట్‌ చేయనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది.

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సినిమాల విషయంలో దూకుడు పెంచిన సామ్‌ వరుస సినిమాలు సైన్‌ చేస్తుంది. కాగా పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్టూడెంట్‌ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu