HomeTelugu Trendingరెమ్యూనరేషన్‌ తగ్గించుకున్న సమంత!

రెమ్యూనరేషన్‌ తగ్గించుకున్న సమంత!

6 22స్టార్‌ హీరోయిన్‌లు సమంత, నయనతార హీరోయిన్‌లుగా తమిళంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు టాప్ హీరోయిన్లు కలిసి నటించడం నిజమేనట! అంతే కాదు ఈ సినిమాలో నటించడానికి సమంత తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందట..! ఎందుకంటే… కరోనా కారణంగా నష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ ను ఆదుకోవడంకోసమే తాను ఈ పని చేసింది అని అంటున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తున్న కారణంగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇక విగ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఏడాది సమంత ‘జాను’ సినిమాతో అభిమానులను పలకరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu