HomeTelugu Newsవెంకటేష్‌ సినిమాలో సూర్య

వెంకటేష్‌ సినిమాలో సూర్య

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేష్‌.. గురు సినిమా రిలీజ్ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. వెంకీ ప్రస్తుతం వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో వెంకటేష్‌తో పాటు వరుణ్‌ తేజ్‌ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ సినిమా చేయనున్నారు.

13 7

అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘వెంకీ మామ’ తో పాటు మరో సినిమా కూడా చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు వెంకటేష్‌. త్రినాథ్‌ రావు నక్కిన దర్శకత్వంలో ఓ ఎమోషనల్‌ డ్రామాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. వెంకటేష్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్‌ హీరో సూర్య కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో దాదాపు 20 నిమిషాలు పాటు సూర్య కనిపించనున్నాడట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా వెంకటేష్‌ సినిమాలో సూర్య నటించటం కన్ఫామ్‌ అన్న ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu