HomeTelugu Trendingసల్మాన్ ఖాన్ సరసన సమంతకు ఛాన్స్

సల్మాన్ ఖాన్ సరసన సమంతకు ఛాన్స్

samantha with Salman

విజయ్ దేరకొండతో కలిసి నటించిన ఖుషి చిత్రం హిట్ కావడంతో సమంత ఖుషీగా ఉంది. పుష్ప చిత్రంలో ప్రత్యేక పాటతో పాటు, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైంది. హాలీవుడ్ వెబ్ సిరీస్‌, ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్‌లోనూ సమంత నటించింది. ఈ సిరీస్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.

మయోసైటిస్‌ కారణంగా ఏడాది పాటు సినిమాలకు సమంత బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత విదేశాల్లో విహారయాత్రలో ఉంది. ఏడాది విరామం పూర్తి కాకముందే సమంతకు బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం.

సల్మాన్ ఖాన్ హీరోగా, కరణ్ జొహార్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్‌తో పంజా సినిమాను తెరకెక్కించిన విష్ణువర్దన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌తో తీయబోతున్న సినిమాలో సమంతను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన జవాన్‌ చిత్రం మంచి విజయం సాధించింది. ఇందులో షారుక్, నయన్ జంటకు మంచి పేరు వచ్చింది.

సల్మాన్ ఖాన్ సినిమాలో దక్షిణాది హీరోయిన్‌ అయితే బాగుంటుందని కరణ్ జోహార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సమంతతో పాటు త్రిష, అనుష్క పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమంతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu