సంక్రాతి బరిలో రజినీ ‘దర్బార్’?

సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టే సీజన్ సంక్రాంతి. సంక్రాంతికి సెలవులకు ఫ్యామిలీ అంతా కలిసి తప్పకుండా సినిమాకు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలుగు, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సంస్కృతీ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే సినిమాలు ఎక్కువగా నిర్మితమౌతుంటాయి.

ప్రతి ఏడాదిలాగే, వచ్చే సంక్రాంతి బెర్త్ ను రిజర్వ్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. అందులో బాలకృష్ణ.. రవికుమార్ సినిమా, మహేష్ బాబు – అనిల్ రావిపూడి సినిమా, సాయి ధరమ్ తేజ్ – మారుతి సినిమా తో పాటు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ .. మురుగదాస్ సినిమా కూడా ఉంది.

రజిని – మురుగదాస్ కాంబినేషన్లో దర్బార్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్. సంక్రాంతిని టార్గెట్ చేసుకొని నిర్మిస్తున్నారు. రజినీకాంత్ లాగే దర్శకుడు మురుగదాస్ కు కూడా సౌత్ లోను, అటు బాలీవుడ్ లోను మంచి మార్కెట్ ఉంది. లేడీ సూపర్ నయనతార గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates