బెడ్రూమ్‌ ముచ్చట్లు పంచుకున్న సమంత!

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ల్లో అక్కినేని సమంత ఒకరు. అక్కినేని లాంటి ఇంటికి కోడలిగా వెళ్లినా కూడా తన లైఫ్ స్టైల్ ఇంత కూడా మార్చుకోలేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ అదే స్థాయిలో సినిమాలు చేస్తుంది.. అదే రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మీ షో కోసం తన పడకగది విషయాలు కూడా బయటపెట్టి సరికొత్త సంచలనం సృష్టించింది అక్కినేని సమంత. ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అంటూ మరో షోకు శ్రీకారం చుట్టింది లక్ష్మీ.

గతంలో ప్రేమతో మీ లక్ష్మీ, లక్ష్మీ టాక్ షో లాంటి షోలు చేసిన తర్వాత ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్టుతో వచ్చింది. ఇందులో బెడ్రూమ్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు సెలబ్రిటీస్. ఇందులో భాగంగానే సమంత అక్కినేనితో కొన్ని సంచలన విషయాలు చర్చించింది లక్ష్మీ. అందులో పెళ్లికి ముందు వాళ్లు చేసిన డేటింగ్ గురించి కూడా ప్రశ్నలున్నాయి. వీటికి కూడా చాలా ఓపెన్‌గా సమాధానాలు చెప్పింది సమంత. ముఖ్యంగా పడకగది విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది సమంత.

ముఖ్యంగా పడకగదిలో నాగచైతన్యకు తాను రెండో భార్య అని చెప్పింది సమంత. నాగచైతన్య మొదటి భార్య ఆయన పిల్లోస్ అంట. చివరికి చైతూను ముద్దు పెట్టుకోవాలనుకున్నా కూడా పిల్లోస్ తమ మధ్య అడ్డుగా పెడతాడని చెప్పింది సమంత. ఇక బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే నాగచైతన్యకు ఉన్న కోపాన్ని ఎవరు చూడలేదని చెబుతోంది సమంత అక్కినేని. మొత్తానికి బెడ్రూమ్ విషయాలను కూడా చాలా హూందాగా బయటికి చెప్పుకుంది అక్కినేని కోడలు.