HomeTelugu Newsఆ హీరోతో నటించడానికి భయపడ్డాను: సమంత

ఆ హీరోతో నటించడానికి భయపడ్డాను: సమంత

2 27

టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో స్టార్‌ హీరోయిన్‌గా దుసుకూ పోతున్న సమంత కొన్ని రోజులుగా వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వెబ్‌ సిరీస్‌లకు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు స్వాగతం పలుకుతున్నారన్నారు. అందుకే వాటిలో నటించడానికి ఆసక్తి చూపినట్లు తెలిపారు. తన పాత్రలకు ప్రేక్షకాదరణ కూడా లభించిందన్నారు. కొన్ని పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, మరికొన్ని పాత్రలు విమర్శలకు దారితీస్తాయన్నారు. ఆ ఆలోచనతోనే గతంలో నటుడు విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘సూపర్‌ డీలక్స్‌’లో నటించడానికి భయపడినట్లు గుర్తు చేసుకున్నారు. అయినా కొందరి సలహాలతో సాహసించి నటించానన్నారు. ఆ పాత్రకు న్యాయం చేయగలనా అనే భావన తొలుత కలిగిందని, నటన సంతృప్తికరంగా లేకపోతే అభిమానుల విమర్శలకు గురవుతానేమోనని ఆందోళన చెందానని పేర్కొన్నారు. కానీ.. ఆ చిత్రం విడుదలైన తర్వాత తాను అనుకున్నదానికి భిన్నంగా జరిగిందని, అందులో తన పాత్రపై ఎలాంటి విమర్శలు రాలేదన్నారు. అంతేకాకుండా ఉత్తమ అవార్డు అందుకున్నట్లు ఆమె వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu