HomeTelugu Trendingగత 10ఏళ్లుగా అఖిల్‌ వాల్ పేపర్ ఏంటో తెలుసా!

గత 10ఏళ్లుగా అఖిల్‌ వాల్ పేపర్ ఏంటో తెలుసా!

same wallpaper in akhil akk
అక్కినేని యంగ్ హీరో అఖిల్ గత పది సంవత్సరాలుగా ఏ సెల్ ఫోన్ కొన్నా, అందులో వాల్ పేపర్ గా తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు ఫోటోనే పెట్టుకోవడం అఖిల్ కు అలవాటు. ఇటీవల అఖిల్ ఓ లేటెస్ట్ ఫోన్ కొన్నాడు. అందులో కూడా తనకు నచ్చిన తాతయ్య పిక్ ను పెట్టేశాడట.

same wallpaper 1
అఖిల్ ను అంతగా ఆకట్టుకున్న తాతయ్య ఫోటో ఏది? ఓ బ్లాక్ అండ్ వైట్ ఏయన్నార్ పిక్ అఖిల్ ను ఆకట్టుకుంది. అందులో ఏయన్నార్ బ్లాక్ కోట్ వేసుకొని, బౌ టై పెట్టుకొని చెలాకీగా చూస్తూ ఉన్నారు. ఆ మధ్య ఏయన్నార్ జయంతి సందర్భంగా అక్కినేని అభిమానులు ఏర్పాటు చేసిన ఏయన్నార్ ఫోటో ఎగ్జిబిషన్ లోనూ ఆ ఫోటో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అదే విధంగా ఏయన్నార్ సొంత మనవడు అఖిల్ కూడా ఆ ఫోటోకు ఎట్రాక్ట్ అయ్యాడు. అప్పటి నుంచీ తాను ఏ సెల్ ఫోన్ కొన్నా అందులో వాల్ పేపర్ గా తన తాతయ్య ఫోటోనే పెట్టుకోవడం హాబీగా చేసుకున్నాడు అఖిల్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu