HomeTelugu Trendingఆకర్షణీయంగా 'సమ్మతమే' ఫస్ట్‌లుక్

ఆకర్షణీయంగా ‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్

Sammathame first look

‘రాజవారు రాణివారు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన నటుడు కిరణ్ అబ్బవరం. తొలి సినిమాతోనే అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటించిన SR కల్యాణ మండపం సినిమా ఆగస్ట్‌ 6న విడుదల కాబోతుంది. మరో సినిమా సెబాస్టియన్ పీసీ 524 చిత్రంలోనూ నటిస్తున్నాడు. తాజాగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో ‘సమ్మతమే’ అనే సినిమా చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా సమ్మతమే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్‌లుక్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కలర్‌ ఫొటో ఫేమ్ చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu