HomeTelugu Trendingసమంత, నాగ చైతన్యలు నిర్మాతలుగా మారుతున్నారా?

సమంత, నాగ చైతన్యలు నిర్మాతలుగా మారుతున్నారా?

1 11అక్కినేని సమంత, నాగ చైతన్యలు ఏం మాయ చేశావే, మనం, మజిలీ సినిమాలతో మంచి కొట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వస్తే అందులో మూడు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సమంత ఓ బేబీ సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది.

నందిని రెడ్డితో మరో సినిమా చేసేందుకు సమంత సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథను సమంత కోసం నందిని రెడ్డి సిద్ధం చేస్తోందట. ఈ మూవీకి సమంత, నాగ చైతన్యలు ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. కొత్త బ్యానర్ స్థాపించి నందిని రెడ్డితో సినిమా చేస్తారా లేదంటే.. అన్నపూర్ణలో చేస్తారా లేదంటే మనం మూవీస్ బ్యానర్లో చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu