ఈ విజయానికి మీరు అర్హులే: మహేష్‌బాబు

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ నాయకులకు సినీ ప్రముఖుల నుంచి శుంభాకాం​క్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు సోషల్‌ మీడియా ద్వారా టీఆర్‌ఎస్ నేతలకు అభినందనలు తెలియజేయగా ఇప్పుడు సూపర్‌ స్టార్‌ మహేష్‌​ బాబు కూడా తన స్నేహితుడు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. “ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీరు అన్ని రకాలుగా ఈ విజయానికి అర్హులు. ఇక ముందు కూడా ప్రజల మనిషిగా కొనసాగండి” అంటూ ట్వీట్‌ చేశాడు మహేష్‌ బాబు. చాలా కాలంగా మహేష్‌తో కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ‘భరత్‌ అనే నేను’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ కేటీఆర్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే.