HomeTelugu Trendingమాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: సముద్రఖని ఫస్ట్‌లుక్‌

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: సముద్రఖని ఫస్ట్‌లుక్‌

Samuithirakani first look f
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’. చాలా కాలం తర్వాత నితిన్ ఫుల్ మాస్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌. ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుండి స‌ముద్ర‌ఖ‌ని ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఈ చిత్రంలో రాజ‌ప్ప పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తున్నాడు. ఈ ఫస్ట్‌లుక్‌లో స‌ముద్ర‌ఖ‌ని నెరిసిన జుట్టు, మీసం క‌ట్టుతో ఉన్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu