HomeTelugu Trendingనేను స్టూడెంట్‌ సర్‌: సముద్ర ఖని ఫస్ట్‌లుక్‌

నేను స్టూడెంట్‌ సర్‌: సముద్ర ఖని ఫస్ట్‌లుక్‌

samuthirakani fistr look f
బెల్లంకొండ గణేశ్‌ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌ తండ్రి అర్జున్‌ వాసుదేవన్‌గా పోలీసాఫీసర్‌ పాత్రలో సముద్రఖని నటిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో అవంతిక దస్సానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

రాఖీ ఉప్పలపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాలో సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సతీశ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu