HomeTelugu TrendingNTR: మరో బాలీవుడ్‌ మూవీలో దేవర!

NTR: మరో బాలీవుడ్‌ మూవీలో దేవర!

Ntr in another hindi movie

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా బీజీగా ఉన్నాడు. ఈమూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్‌ బాలీవుడ్‍లో స్టార్ హీరో హృతిక్ రోషన్‍తో కలిసి వార్-2 సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వార్-2 రూపొందనుంది.

వార్-2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏ క్యారెక్టర్ చేయనున్నారో సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో భారత ఏజెంట్‍ పాత్రను ఎన్టీఆర్ పోషించనున్నారని టాక్‌. యశ్‍రాజ్ ఫిల్మ్ యూనివర్స్‌లో ఇప్పటికే సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారూఖ్ ఖాన్ ఇండియన్ ఏజెంట్లుగా చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా కొత్త రా ఏజెంట్‍గా ఎంటర్ అయ్యారు.

2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు వార్-2 రూపొందనుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ క్యారెక్టర్లలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్టు పేర్కొంది.

ఈసినిమా తర్వాత ఈ వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లోనే ఎన్టీఆర్ మరోక హిందీ మూవీ కూడా చేయనున్నారని టాక్. ఇండియన్ రా ఏజెంట్‍గా ఆ చిత్రంలో హీరోగా ఆయన ఉంటారని రూమర్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఈ యూనివర్స్‌లో వచ్చే చిత్రాల్లో క్యామియో రోల్స్ కూడా చేయనున్నారు.

వార్-2 మూవీ షూటింగ్ మార్చి 7న ప్రారంభం కానున్నట్లు సమాచారం. టోక్యోలోని చారిత్రక షావోలిన్ టెంపుల్ వద్ద షూటింగ్ షూరూ అవనుందట. ప్రస్తుతం దేవర చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. వార్-2 షూటింగ్‍లో ఏప్రిల్‍లో పాల్గొనేలా ప్లాన్ చేశారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu