HomeTelugu Trendingదగ్గుబాటి అభిరామ్‌ సినిమాలో సముద్రఖని!

దగ్గుబాటి అభిరామ్‌ సినిమాలో సముద్రఖని!

Samuthirakani
టాలీవుడ్‌ డైరెక్టర్‌ తేజ డైరెక్షన్‌లో దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఇతర నటీనటులను పిక్స్‌ చేసే పనిలో పడింది.

ఇందులో భాగంగా ఓ ప్రధాన పాత్ర కోసం కోలీవుడ్‌ నటుడు సముద్రఖనిని తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ విషయమై దర్శక నిర్మాతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తేజ శైలిలో సాగే కొత్తదనం నిండిన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమాకి ‘అహింస’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu