రేపు ఎన్‌సీబీ విచారణకు రకుల్


డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రేపు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు విచారణకు హాజరుకానుంది. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్‌లోని పలువురికి ఎన్‌సీబీ నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతికేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. దీంతో ఎన్‌సీబీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురు అరెస్టయ్యారు. ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి పలువురి పేర్లు వెల్లడించింది. దాని ఆధారంగా ఎన్‌సీబీ పలువురికి నోటీసులిచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ తారలు రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌సీబీ సమన్లు జారీచేసింది.

ఇవాళ ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాను ఎన్‌సీబీ అధికారులు విచారణ జరిపారు. అయితే రకుల్ మాత్రం తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ప్రకటించింది. దీనిపై స్పందించిన ఎన్‌సీబీ అధికారులు రకుల్‌ తప్పించుకోవడానికే అలా చెప్తుందని ఆరోపిస్తున్నారు. తాము నోటీసులు పంపించడం వాస్తవమేనని వెల్లడించింది. ఇవాళ రకుల్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. రేపు కూడా విచారణకు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో రకుల్ దిగివచ్చింది. తనకు నోటీసులు అందినట్లు, రేపు ఎన్‌సీబీ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

నోటీసులు అందలేదంటున్న రకుల్‌.. ఖండించిన అధికారులు

CLICK HERE!! For the aha Latest Updates