HomeTelugu Trendingడెవిల్‌: సయుంక్త మీనన్‌ ఫస్ట్‌లుక్‌

డెవిల్‌: సయుంక్త మీనన్‌ ఫస్ట్‌లుక్‌

samyuktha menon first look

గతేడాది భీమ్లానాయక్‌ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంయుక్త మీనన్‌. ఆతరువాత సార్‌ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొత్తం ఆమె తెలుగులో చేసిన నాలుగు సినిమాలు బంపర్‌ హిట్లే. దీంతో ఇమెకు వరుస అవకావలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో డెవిల్‌ ఒకటి.

కళ్యాణ్ రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నవీన్‌ మేడారం దర్శకత్వ వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సంయుక్త మీనన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. చేతిలో కొబ్బరి కాయ, పూలమాలతో ఉన్న బుట్టను పట్టుకుని దేవుడికి పూజా చేయడానికి వెళ్తున్నట్లు ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. తెలుగు తనం ఉట్టి పడేలా ఉన్ ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది.. సయుంక్త చాలా అందంగా కనిపిస్తుంది.

చుట్టు గోపురాలు, గంట, తెల్లటి పావురాలు.. ఇలా పోస్టర్‌ మంచి పాజిటీవ్‌ వైబ్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమాలో సంయుక్త నిషాదగా కనిపించనుంది. పీరియాడిక్‌ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ బ్రిటీషర్‌లకు సీక్రెట్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 24న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu