నువ్వేమైనా చిరంజీవి ఫ్యామిలీనా.. స్వాతినాయుడుపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

స్వాతినాయుడు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రొమాంటిక్ మాటలతో ఆకట్టుకునే ఈ యాంకర్, యూట్యూబ్ లో రాణించింది. పలు చిత్రాల్లో నటించిన ఈ నటి గతేడాది ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా, మే 10వ తేదీన ఆమె పండంటి బిడ్డకు జన్మను ఇచ్చింది. బిడ్డకు జన్మను ఇచ్చి మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నది. గత జీవితం ఎలా ఉన్నా తల్లిగా తాను హ్యాపీగా ఉన్నట్టు స్వాతినాయుడు పేర్కొన్నది.

స్వాతినాయుడికి బిడ్డపుట్టిన విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డి, స్వాతినాయుడికి శుభాకాంక్షలు తెలిపింది. శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా కొన్ని వివాదాస్పద కామెంట్లు కూడా చేసింది. ఏమైనా నువ్వు చిరంజీవి ఫ్యామిలీ చెందిన దానివి కాదుకదా అందుకే మీ పాప ఫోటోలు వైరల్ కాలేదు అని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

CLICK HERE!! For the aha Latest Updates