HomeTelugu Big Stories'రాధేశ్యామ్': సంచారి ఛల్‌ ఛలో.. సాంగ్‌ వచ్చేసింది

‘రాధేశ్యామ్’: సంచారి ఛల్‌ ఛలో.. సాంగ్‌ వచ్చేసింది

Sanchari Video Song from Ra
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా నుంచి సరికొత్త వీడియో సాంగ్‌ వచ్చేసింది. ‘సంచారి ఛల్‌ ఛలో’ అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్‌.. జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించిన యువకుడిగా కనిపించారు. ఆయన యంగ్‌ లుక్‌లో అదరగొట్టేశారు. యూరప్‌ వీధుల్లో , మంచు కొండల్లో ఎంతో హుషారుగా కనిపించారు. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌. ఇందులో ప్రభాస్‌ లవర్‌బాయ్‌ పాత్రలో కనిపించనున్నారు. హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో విక్రమాదిత్యగా మెప్పించనున్నారు. పూజా ప్రేరణ పాత్రలో ఆకట్టుకోనున్నారు. విక్రమాదిత్య.. ప్రేరణను సొంతం చేసుకోగలిగాడా? లేదా? వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికర కథాంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకొంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu