చిరంజీవిని ఆటో ఎక్కించారు!

మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు చిరంజీవి. అయితే ఈ షోకి వచ్చిన ఓ కంటెస్టంట్ కోసం చిరు ఏకంగా ఆటో ఎక్కేశారు. ఇలాంటి పనులు చేయాలంటే మన టాలీవుడ్ సూపర్ స్టార్లు అసలు ముందుకు రారు. కానీ చిరంజీవి ఇచ్చిన మాట కోసం ఓ వ్యక్తి సంతోషం కోసం ఆటో ఎక్కి తన మాట నిలబెట్టుకున్నాడు.

నిన్న జరిగిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో సతీష్ అంటే వ్యక్తి హాట్ సీట్లోకి వచ్చాడు. అతగాడు మేడ్చల్ కు చెందిన ఆటో డ్రైవర్. అతను వచ్చిన సమయంలో చిరు కూడా తాను ఆటోజానీ సినిమాలో ఆటో నడిపానని గుర్తు చేసుకున్నారు. 

ఆ సంధర్భంగా.. సతీష్ మీరు ఒక్కసారైనా నా ఆటో ఎక్కడి సర్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఎన్నో ఏళ్ల తరువాత చిరు నిజంగానే ఆటో ఎక్కేశారు. అలా చిరుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆటోలో తిప్పి సతీష్ ఆనందపడ్డాడు.