HomeTelugu Trendingసంజన గల్రానీ.. పెళ్లి ఫొటోలు వైరల్‌

సంజన గల్రానీ.. పెళ్లి ఫొటోలు వైరల్‌

Sanjana galrani marriage piటాలీవుడ్‌లో తరుణ్ నటించిన సోగ్గాడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంజన గల్రాని.. ఆ తరువాత బుజ్జిగాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించింది. తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ చిత్రసీమలో ఎక్కువగా బిజీ అయ్యింది. ఆ మధ్య ‘దండుపాళ్యం 3’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది సంజన. ఇక గత ఏడాది శాండిల్ వుడ్‌ను ఓ ఊపు ఊపిన డ్రగ్స్ కేసులో సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. జైలుకు కూడా వెళ్లింది. దాదాపుగా మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై బయటికొచ్చిన సంజన.. తాజాగా పెళ్లి చేసుకుంది. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సంజన ధృవీకరించడంతో పాటు ఓ పెళ్లి ఫోటో ని కూడా షేర్ చేసింది. సంజన రహస్య వివాహానికి కొద్దిమంది స్నేహితులు, బంధువులు హాజరయ్యారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu