HomeTelugu Trendingప్రముఖ బాలీవుడ్‌ నటుడికి లంగ్ క్యాన్సర్..

ప్రముఖ బాలీవుడ్‌ నటుడికి లంగ్ క్యాన్సర్..

Sanjay dutt has lung cancer
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆయన ఇటీవల (ఆగష్టు 8)న శ్వాస సరిగ్గా ఆడట్లేదని ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చేరాడు. శ్వాస సమస్యతో ఇబ్బందితో బాధపడుతుండడంతో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. అయితే నెగటివ్ రావడంతో వైద్యులు ఆయనను ఐసీయూ వార్డు నుండి ఆదివారం నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. అయితే అదే సమయంలో జరిపిన పరీక్షల్లో ఆయనకు లంగ్ కాన్సర్ ఉన్నట్టు తేలింది. అంతేకాదు ప్రస్తుతం సంజయ్ దత్ మూడవ స్టేజి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడట. దీంతో మెరుగైన చికిత్స కోసం అమెరికాకు పయనమైనట్టు సమాచారం. సంజయ్ దత్ కి బాగా తాగుడు మరియు సిగరెట్ల అలవాటు ఉందన్న విషయం తెలిసిందే. గతంలో అతను మాదకద్రవ్యాలు కూడా తీసుకున్నట్లు అతని బయోపిక్ గా పేర్కొన్న ‘సంజు’ లో కూడా చూపించారు. అవే ఆయన క్యాన్సర్ కి కారణం అయి ఉండచ్చని చెబుతున్నారు. ఈ విషయంపై సంజయ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కొంతకాలం ఆరోగ్య సమస్యల కారణాలు వల్ల విరామం తీసుంటున్నాని ఫ్యాన్స్ బాధపడొద్దని ప్రకటించాడు. అయితే తమ అభిమాన హీరో‌కు క్యాన్సర్ అని తేలడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులుతో పాటు సిని ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu