HomeTelugu Trendingఏజెంట్‌ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

ఏజెంట్‌ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

Malli Malli Song Promo from
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అఖిల్.. రా ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ హైప్స్‌ ఉన్నాయి. ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. రోజుకో అప్డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది.తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘మళ్లీ మళ్లీ ‘ ప్రోమో విడుదలైంది.

ఇది ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంది. ఫిబ్రవరి సాయంత్రం 7 గంటలకు ఈ పాటను ట్విట్టర్ వేదికగా విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది.ఈ చిత్రానికి హిప్హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నాడు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు.

నిర్మాత అనిల్ సుంకరతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతోనే సురేందర్రెడ్డి నిర్మాతగా మారబోతున్నాడు. చిరంజీవి సైరా నరసింహారెడ్డి తర్వాత సురేంద్రరెడ్డి డైరక్షన్ చేస్తున్న చిత్రం ఇది.దాదాపు రూ.90కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందింది.

ఈ సినిమాలో అఖిల్‌ 8 ప్యాక్స్‌లో కనిపించబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత అఖిల్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. అయితే ఇప్పటి వరుకు సరైన హిట్‌ లేని అఖిల్‌కు ఈ సినిమా అయిన కలిసి వస్తుందేమో చూడాలి.

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu