HomeTelugu Trendingఎ. ఎస్. రవికుమార్ చౌదరి డైరెక్షణ్‌లో సప్తగిరి సినిమా

ఎ. ఎస్. రవికుమార్ చౌదరి డైరెక్షణ్‌లో సప్తగిరి సినిమా

Saptagiri new movie with AS

టాలీవుడ్‌ స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగాను పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సప్తగిరి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ. ఎస్. రవికుమార్ చౌదరి డైరెక్షణ్‌లో సప్తగిరి ఓ సినిమా చేయబోతున్నాడు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఎ. ఎస్. రిగ్వేద చౌదరి ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ .. ‘వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. రవికుమార్ చౌదరి దర్శకత్వం సినిమాకు బలం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’ అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu