మెట్రో ఎక్కిన నితిన్‌.. ఎందుకో తెలుసా!

హైద‌రాబాదులో ట్రాఫిక్ క‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా యువ నటుడు నితిన్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. ఈయ‌న ప్ర‌స్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ సినిమాలో న‌టిస్తున్నాడు. ఛ‌లో త‌ర్వాత ఈయ‌న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి త‌ప్పించుకోడానికి హీరో నితిన్ మెట్రో ఎక్కాడు.

తొలిసారి మెట్రో ట్రెయిన్ ఎక్కి సెల్ఫీలు తీసుకుని ఫేస్ బుక్కులో పోస్ట్ చేసాడు ఈ కుర్ర హీరో. మెట్రో జ‌ర్నీ చాలా అద్భుతంగా ఉందంటూ పోస్ట్ చేసాడు ఈయ‌న‌. ట్రాఫిక్ క‌ష్టాల నుంచి త‌ప్పించుకోడానికి ఇది చాలా బాగుంద‌ని చెప్పాడు నితిన్. ఈయ‌న ఒక్క‌డే కాదు.. చాలా మంది కూడా ఇప్పుడు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి త‌ప్పుకోడానికి మెట్రో ఎక్కేసి వెళ్లిపోతున్నారు. నితిన్ కూడా ఇప్పుడు ఇదే చేసి చూపించాడు. నితిన్ ట్రెయిన్‌లో ప్ర‌త్యక్షం కావ‌డంతో అభిమానులు కూడా స‌ర‌దాగా ఆయ‌న‌తో సెల్ఫీలు తీసుకున్నారు.