HomeTelugu Trendingసర్కారు వారి పాట: 'పెన్నీ' సాంగ్‌ వచ్చేస్తుంది

సర్కారు వారి పాట: ‘పెన్నీ’ సాంగ్‌ వచ్చేస్తుంది

Sarkaru vaari paata second

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ పెట్ల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ‘GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేన’ వై. రవిశంకర్‌ రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మొదటి పాట కళావతి సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే రెండో పాటపై కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా ఈ రెండో పాట విడుదలకి డేట్‌ ఫిక్స్‌ చేశారు మేకర్స్. పెన్నీ అంటూ సాగే ఈ సాంగ్ ని మార్చి 20 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా మహేష్ న్యూ పోస్టర్ ని కూడా రీవిల్‌ చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్‌ కూల్ అండ్ సూపర్ స్టైలిష్ గా ఆకట్టుకుంటున్నాడు. ఇక పెన్నీ అంటే డబ్బులు అని అర్ధం వస్తుంది.. మరి ఈసారి టైటిల్ కి తగ్గట్టు ఈ సాంగ్ ఉండబోతుందని అభిమానులు అంటున్నారు.

‘రాధే శ్యామ్’ 4 రోజుల కలెక్షన్స్..!

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ క్లోజింగ్ కలెక్షన్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu