HomeTelugu Big Stories'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్‌

‘సర్కారు వారి పాట’ మూవీ ట్రైలర్‌

Sarkaru Vaari Paata Official Trailer
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మే12న విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు(మే 2) సర్కారు వారి పాట ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు‌. ఈ నేపథ్యంలో ట్రైలార్‌ లాంచ్‌ ఈవెంట్‌ను కూకటపల్లిలోని భ్రమరాంబ థియేటర్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించి మెంటల్‌ మాస్ స్వాగ్‌తో కూడిన 105 షార్ట్స్ గల ట్రైలర్ వదిలారు మేకర్స్‌. ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. యాక్షన్‌, రొమాన్స్‌ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

కీర్తి సురేశ్‌తో మహేశ్‌ బాబు రొమాన్స్‌ సీన్స్‌, ఫన్నీ డైలాగ్స్‌ నెక్ట్‌లెవల్‌ అని చెప్పొచ్చు. ఇక యాక్షన్‌ సీన్స్‌ చూస్తుంటే సూపర్‌ స్టార్ అభిమాలకు చిత్ర బృందం మంచి ట్రీట్‌ ఇచ్చిందనడంలో ఎలాంటి అతిశయేక్తిలేదు. కాగా మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu