HomeTelugu Trending'శశివదనే' టీజర్‌

‘శశివదనే’ టీజర్‌

Sasivadane movie Teaser
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి .. కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం ‘శశివదనే’. ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల దీనిని నిర్మించారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు, సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించాడు.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథ అని తెలుస్తోంది. హీరో – హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి.

ఇక టీజర్ ఎండింగ్‌లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu