HomeTelugu Trending'సత్యభామ' టీజర్‌ విడుదల

‘సత్యభామ’ టీజర్‌ విడుదల

Satyabhama movie Teaser

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యభామ. ఈ సినిమాలో కాజల్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా అలరించనుంది. క్రైమ్‌ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాని సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు.

అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుదలైన గ్లింప్స్ ఈ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలో నేడు దీపావళి కానుకగా ఈ సినిమా టీజ‌ర్‌ ను విడుద‌ల చేశారు.

‘సత్య ఈ కేసు నీ చేతుల్లో లేదు. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సర్. అంటూ కాజల్‌ అగర్వాల్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. ఇక టీజ‌ర్ చూస్తే హైద‌రాబాద్‌ నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును పోలీసాఫీసర్‌గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ ఎలా పరిష్కరించారనేది ఈ మూవీ.

ఇక ఈ టీజ‌ర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే సమ్మర్ కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu