HomeTelugu Big Storiesసీనియర్‌ నటుడు చలపతిరావు కన్నుమూత

సీనియర్‌ నటుడు చలపతిరావు కన్నుమూత

senior Actor Chalapathi Rao

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. తన కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు నివాసంలో ఆయన మృతి చెందారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. 1,200కు పైగా సినిమాలలో చలపతిరావు నటించారు.

కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944లో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి వార్తతో టాలీవుడ్ షాక్ కు గురైంది. కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులకు కూడా కాకముందే చలపతిరావు కన్నుమూయడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. . ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. వారు వచ్చేంత వరకు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు నివాసంలోనే ఉంచనున్నారు. మధ్నాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచుతారు. బుధవారంనాడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు చలపతిరావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu