రెజీనా షాకింగ్ లుక్!

హీరో నాని నిర్మాతగా మారి ‘వాల్ పోస్టర్’ అనే బ్యానర్ మీద ‘అ!’ అనే సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కాజల్, రెజినా, ఈషా రెబ్బ, నిత్యా మీనన్ నటిస్తున్నారు. రీసెంట్ గా సినిమాలో నటిస్తున్న కాస్ట్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ వస్తున్న నాని. ఈరోజు రెజినా లుక్ రివీల్ చేశారు. ఒళ్లంతా ట్యాటూలతో రెజినా లుక్ సర్ ప్రైజ్ చేసింది. ఇన్నాళ్లు హాట్ లుక్స్ తో అదరగొట్టిన రెజినా మొదటిసారి ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుందని అంటున్నారు. బడాస్ పాత్రలో రెజినా లుక్ షాక్ ఇచ్చిందంటే నమ్మి తీరాల్సిందే. 

ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లలో ఈషా క్యూట్ గా అలరించగా.. నిత్యా మీనన్ తన స్టైల్ తో కనిపించింది. ఇక అవసరాల శ్రీనివాస్ సూర్య 24 సినిమాలో లాగా ఏదో ప్రయోగం చేస్తున్నట్టు కనిపించాడు. మొత్తానికి సినిమా పోస్టర్లతోనే ఆసక్తిని క్రియేట్ చేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ఎనబై శాతం సినిమా షూటింగ్ పూర్తయింది.