HomeTelugu Trendingప్రాణహాని ఉందంటున్న సీనియర్ నటుడు

ప్రాణహాని ఉందంటున్న సీనియర్ నటుడు

Senior actor naresh
ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న సీనియర్ నటుడు నరేశ్. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తనకు ప్రాణహాని ఉందంటూ తుపాకి లైసెన్స్ ఇవ్వాలంటూ ఎస్పీని కలిశారు. రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని కోరారు.

నిన్న పుట్టపర్తిలో ఎస్పీని కలిసిన నరేష్ తనకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని వివరించాడు. 2008లో లైసెన్స్ రివాల్వర్ తీసుకున్నట్టు తెలిపారు. మళ్లీ దానికి అనుమతి ఇవ్వాలని గతంలో కోరినా ఇవ్వలేదని, ఇప్పుడు హిందూపురంలో ఉంటున్న తనకు లైసెన్స్ రివాల్వర్‌ను తన వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తన అభ్యర్థనకు ఎస్పీ సానుకూలంగా స్పందించినట్టు నరేశ్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu