HomeTelugu Big Storiesప్రముఖ నటి 'జమున' ఇకలేరు

ప్రముఖ నటి ‘జమున’ ఇకలేరు

Senior actress Jamuna passe

టాలీవుడ్ ప్రముఖ సీనియర్‌ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. 1936 ఆగస్ట్ 30న ఆమె జన్మించారు. అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందారు. తెలుగు- తమిళం సహా ఇతర భాషలతో కలిపి ఆవిడ 200 చిత్రలకు పైగా నటించారు. ఆమె తన అందంతో పాటు, అభినయం, నృత్యాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

జమున కర్ణాటకలోని హంపిలో జన్మించారు. ఆమె అసలు పేరు జానా బాయి. ఆమె తల్లిదండ్రులు నిప్పింగ్ శ్రీనివాసరావు- కౌసల్యాదేవి. జమున మాతృ భాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు పరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరపడిపోయారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో సైతం ఆమె రాణించారు. 1989 నుంచి 1991 వరకు రాజమండ్రి ఎంపీగా ఆమె ఉన్నారు. ఫిలింఫేర్ తో పాటు పలు అవార్డులు ఆమెను వరించాయి. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu