చిరు, రాజశేఖర్ కలిసిపోయినట్లే!

రాజశేఖర్ చేయాలనుకున్న ‘ఠాగూర్’ సినిమా చిరంజీవి చేసినప్పటి నుండి కూడా వీరిమధ్య గ్యాప్ పెరిగిపోయింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తరువాత ఆ గ్యాప్ మరింత ఎక్కువైంది. రాజశేఖర్.. చిరుని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం, ఆ తరువాత మెగా ఫ్యాన్స్ రాజశేఖర్ ను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిన విషయాలే. రాజశేఖర్ మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా.. సరే చిరుకి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య గ్యాప్ తగ్గిందనే విషయం తెలుస్తోంది. రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ’ సినిమా మరో రెండు
రోజుల్లో ప్రేక్షకుల్లో ముందుకు రానుంది. అయితే రాజశేఖర్ స్వయంగా చిరంజీవిని కలిసి తన సినిమా ప్రీమియర్ షో చూడమని పిలిచారట.

ఆయన కూడా వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. చిరుతో పాటు పవన్ ను కూడా కలవాలని భావించిన రాజశేఖర్.. పవన్ బిజీగా ఉండడం వలన కుదరలేదని వెల్లడించారు.