HomeTelugu Trendingశాకుంతలం: సమంత ఫస్ట్‌లుక్‌

శాకుంతలం: సమంత ఫస్ట్‌లుక్‌

samantha
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నాటకం ‘శాకుంతలం’. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించగా, ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాణంలో రూపొందుతోంది. 2022లో టాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర దశలో ఉంది. కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం ‘శకుంతల’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సమంత అడవిలో తెల్లని దుస్తువులు ధరించి దేవకన్యలా అందంగా కన్పిస్తోంది. ఆమె తేజస్సు, చుట్టూ జంతువులు చేరడం ప్రేక్షకులను మరో ఫాంటసీ లోకానికి తీసుకెళ్తుంది.

ఇందులో పురు రాజవంశం రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాతో ప్రిన్స్ భరతుడిగా సినిమా రంగ ప్రవేశం చేయనుంది. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల మరియు వర్షిణి సౌందరరాజన్ తదితరులు నటిస్తున్నారు. గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu