HomeTelugu Big Storiesషారుక్‌-సుశాంత్‌ సింగ్‌ డాన్స్‌ త్రోబ్యాక్ వీడియో వైరల్‌..

షారుక్‌-సుశాంత్‌ సింగ్‌ డాన్స్‌ త్రోబ్యాక్ వీడియో వైరల్‌..

8 6
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా ఎదిగి స్టార్‌హీరో రేంజ్‌కు ఎదిగిన షారుక్ అంటే సుశాంత్ కు చాలా ఇష్టం. టీవీ స్ర్కీన్ నుంచి సిల్వర్ స్ర్కీన్ పైకి ప్రయాణాన్ని సాగించిన సుశాంత్ మంచి డ్యాన్సర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2017లో ఓ టీవీ రియాలిటీ షోలో సుశాంత్ షారుక్ తో కలిసి డ్యాన్స్ చేశాడు. ‘ఛయ్య ఛయ్య’ అంటూ సాగే సూపర్ హిట్ ట్రాక్ కు షారుక్, సుశాంత్ స్టేజీపై డ్యాన్స్ చేశారు. చాలా స్టైలిష్ గా సుశాంత్ డ్యాన్స్ చేస్తుంటే.. పక్కనే ఉన్న ఫరాఖాన్, సానియామీర్జా వారిలో మరింత జోష్ నింపుతున్నారు.

స్టేజీ కిందున్న అభిమానులు కేకలు వేస్తూ ఈ ఇద్దరు హీరోల డ్యాన్స్ ను ఎంజాయ్ చేశారు. షారుక్ ఫ్యాన్స్ పేజీలో షేర్ చేసిన ఈ త్రోబ్యాక్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu