HomeTelugu Big Storiesరోజాకి జబర్దస్త్‌ జోడిగా యంగ్‌ హీరో

రోజాకి జబర్దస్త్‌ జోడిగా యంగ్‌ హీరో

3 29ప్రముఖ కామెడీషో జబర్దస్త్‌కు నాగబాబు గుడ్‌బై చెప్పడంతో ఆ షోలో ప్రస్తుతం ఒక్కరే జడ్జి ఉన్నారు. ఈ వారం రోజా మాత్రమే జడ్జిగా వ్యవహరించారు. ఐతే నాగబాబు స్థానంలో వచ్చే కొత్త జడ్జి ఎవరనే దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ముగ్గురు నలుగురు సీనియర్ నటులు, కమెడియన్లను మల్లెమాల యాజమాన్యం పరిశీలిస్తోందని.. వారిలో ఒక్కరిని ఖరారు చేస్తారని సమాచారం. ఐతే అప్పటి వరకు రోజాను మాత్రమే జడ్జిగా కొనసాగించకుండా.. ఆమెకు తోడుగా గెస్టులను తీసుకొస్తున్నారు. వచ్చేవారం జబర్దస్త్‌లో యువ హీరో కార్తికేయ సందడి చేయబోతున్నారు. గెస్ట్ జడ్జిగా వ్యవహరించి నవ్వుల జల్లు కురిపించబోతున్నారు.

వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో ఇప్పటికే విడుదలయింది. ఆ ప్రోమోలో రోజా పక్కన కూర్చుని జడ్జిగా కనిపించారు కార్తికేయ. 90 ML మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జబర్దస్త్‌కు విచ్చేశాడు. జడ్జిగా మార్కులు ఇవ్వడంతో పాటు వెంకీ మంకీస్ స్కిట‌్‌లో కామెడీ కూడా చేశాడు. జబర్దస్త్ రెడ్ స్టార్ జీవన్‌పై కార్తికేయ పంచ్‌లు వేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఐతే కార్తికేయ వచ్చే గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్‌కి మాత్రమే గెస్ట్ జడ్జిగా వ్యవహరించారు. మరి శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి రోజాతో పాటు ఎవరు గెస్ట్‌గా ఉంటారన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఇలా గెస్ట్ జడ్జిలు కాకుండా పూర్తిస్థాయిలో కొత్త జడ్జిని నియమించేందుకు యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

3a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu