HomeTelugu Trendingబిగ్‌బాస్‌-7లో షకీలా!

బిగ్‌బాస్‌-7లో షకీలా!

shakeela in bigg boss 7

టెలివిజన్‌ చరిత్రలోనే అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటికే 6 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో. సెప్టెంబర్ 3 నుంచి స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్-7 ప్రసారం కానుంది. ఇప్పటికే బిగ్‌బాస్‌-7 ప్రోమో కూడా విడుదలైంది. దీంతో ఈ సీజన్‌లో పాల్గోననున్న కంటెంస్టెట్స్‌ పై ఆసక్తి నెలకొంది. దీంతో రోజుకో కొత్త పేరు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంది.

తాజాగా మరో పేరు బయటకు వచ్చింది. ప్రముఖ సినీ నటి షకీలా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. శృంగార తారగా షకీల ఒకప్పుడు వెలుగు వెలిగింది. మలయాళంలో తెరకెక్కిన ఆమె చిత్రాలు అనేక భాషల్లోకి డబ్ అయ్యేవి. ఆ తర్వాత ఆమె అలాంటి సినిమాలను మానేసి, మంచి క్యారెక్టర్ పాత్రలను పోషిస్తూ తన కెరీర్ ను కొససాగిస్తోంది. మరోవైపు, ఈసారి కూడా ఈ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu