HomeTelugu Trendingప్రేక్షకులకు షాకిచ్చిన షకీలా

ప్రేక్షకులకు షాకిచ్చిన షకీలా

Shakeela shocked to audienc
సినిమా ఇండస్ట్రీలో షకీలా పేరు వినని వాళ్లు ఉండరేమో. స్టార్ హీరోలకు సైతం దక్కని పాపులారిటీ దక్కించుకుంది నటి షకీలా. ఆ తర్వాత కెరీర్‌లో వెనుకబడినా ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితమయ్యారు. కరోనా సమయంలో తాను నిర్మాతగా ఓ సినిమాను కూడా తెరకెక్కించింది. సినీ కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది నటి షకీలా. ఇప్పటికీ తాను పెళ్లి చేసుకోలేదు. తమిళంలో ‘కుకు విత్ కోమలి’ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది షకీలా. ఈ షోలో తన కుమార్తెను ప్రేక్షకులకు పరిచయం చేసి షాకిచ్చింది షకీలా. మిల్లా నా కుమార్తె అంటూ ఓ యువతిని పరిచయం చేసింది. షకీలా వివాహం ఎప్పుడు చేసుకుందంటూ ఆలోచనలో పడ్డారు ప్రేక్షకులు. అయితే తాను సొంత కూతురు కాదని తనను చాలా ఏళ్ల క్రితమే దత్తత తీసుకున్నట్లు వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu