HomeTelugu Trendingఅల్లు అర్జున్‌పై షకీలా సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్‌పై షకీలా సంచలన వ్యాఖ్యలు

3 5

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ హీరో అల్లు అర్జున్ పై షకీలా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివరాల్లోకి వెళితే.. అసలు విషయానికొస్తే.. శృంగార తారగా షకీలా.. తాజాగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని ఎత్తు పల్లాలను ప్రస్తావించారు. ఇక టాలీవుడ్ హీరోల గురించి చెప్పమని అడగగా.. దాదాపు అందరు హీరోల గురించి చెప్పిన షకీలా, సడెన్‌గా అల్లు అర్జున్ గురించి అడగ్గానే నాకు తెలియదని సమాధానిమచ్చింది. దాంతో యాంకర్ కూడా అంతటితో ఆ మ్యాటర్‌ను ముగించారు. ఈ విషయమై బన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్‌కు మలయాళంలో పాటు నార్త్‌లో ప్రత్యేకంగా అభిమానులున్నారు. అటువంటి హీరో గురించి షకీలా తెలియదని చెప్పడాన్ని బన్ని అభిమానులు జీర్ణంచుకోలేకపోతున్నారు. దీనిపై మరికొందరు ఆమెకు నిజంగానే బన్నితో పరిచయం లేకపోవడం వల్లే అలా చెప్పి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి షకీలా చేసిన ఈ వ్యాఖ్యలను అంతగా పట్టంచుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఇంకొందరు. ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu